ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
సారము లేని సంసారములో,
అందిన కొద్ది ఖర్మను చేసి,
కాలము తెలియక కాటికి పోతివి.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
ధనము చూచి మురిసిపోకుమా,
దానధర్మము నీకు తోడురా,
పరమేశ్వరుని మరచిపోకురా,
ముక్తి మార్గము నీకు తోడురా.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
మేడలు మిద్దెలు స్థిరమని బ్రమచకు,
కులములు మతములు కూలిపోవురా,
వీరగురువుని సేవ చేయరా,
ముక్తి మార్గమే నీకు తోడురా.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు
ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
No comments:
Post a Comment