Thursday, 1 September 2011

(36.)వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
శంకాలు జేసేటి కుంకాల నందరిని లంకిణి పల్లెకు జాటించచూచుచు
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
రండి రాజ్యము నుంచి దండ మారి వచ్చి చండి వేసేటి వేళ అండాయ మీకు
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
ఆకాశ వీధిలో రాకాసి గుంపులు కేకలు బెట్టుచూ వచ్చు కాలమాయె
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
పోతూలవలె వారు హేతువు దెలియక పోతులూరి గురుడు హేతువు దల్పెను.
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.
ఒప్పుగాను శివపోతులూరి గురుడు ఎప్పుడో ఏ వేళ వచ్చియున్నాడని.
వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడుకూలు విడవండి.
తడవులేదు వీరగురుడు పల్కిన వాక్యం.

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు

ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
(12.) కోటలాటి కోటా

కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
వెయ్యి బురుజుల కోటై యున్నది­_ఏడు ఏరులు బారుచున్నది.
ఎరిగి పొయ్యే గుర్రమున్నది_వెళ్ళిపొయ్యేది బాటై యున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
కొండల నడుమ కొంగ యున్నది_కొంగ ముక్కులో లోకమున్నది.
కోటి దీపములు వెలుగుచున్నది_కోరిన వారికి ఫలమౌచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
ఆరు కొమ్ముల యేనుగున్నది_ఐదు కోతులను మేపుచున్నది.
ఆవల యివల జూచుచున్నది_అతిశయమైన ఆటాడుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
మేఘము లేని వర్షమున్నది_మేకలనైదు మేపుచున్నది.
మేఘములో ఫలమేయుచున్నది_మేలిమైన వైభోగమున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
మూలాధారమునందు యున్నది_మూల మూలకీ తిరుగుచున్నది.
మూలస్థానము ఒకటై యున్నది_మూల జ్యోతియై వెలుగుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
కాదములైదు బాగా యున్నది_నాలుగు దిక్కుల మ్రోగుచున్నది.
నాణ్యమైన భోగమున్నది_ఆది దేవుడు ముందున్నాడు..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
ఒంటి స్థంభము మేడ యున్నది_ఒకటి చూపుడులను చూచుచున్నది.
వూరి కప్ప వలె నవ్వుచున్నది_ఒకటి ఒకటి సరిపడుచున్నది.
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
పదమూడామడ పట్టణమున్నది_పాపల నడుమ లింగమున్నది.
పాము శిరసున పండు యున్నది_పరమ భక్తులకు ఎరుకైయున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
వీరబ్రహ్మము వాక్కుయున్నది_వివరము తెలిసితే బాగైయున్నది.
ఇంటిలోపల అన్నియున్నవి_వీధి లోపల వెలుగుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు

ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
(6.)వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మందుగొనరే...!
వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మందుగొనరే...!,
వీరగురుని మందు మీరు ప్రేమతో భుజింపడయ్యా.
కామక్రోధ,లోభములను రూపు మాపే మాపు మందు..

వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మందుగొనరే...!,
గరిమరెడ్డి వారి ఇంట గోవులాను గాశీనారు, స్వచ్ఛమైన కాలజ్ఞానము రవ్వల కొండలలో రాశీనారు.

వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మందుగొనరే...!,
కందిమల్లయ్య పాలెమందు కాలజ్ఞానము తెలిపిన గురుడు, గోవిందమాంబను పెండ్లియాడి, రాజ యోగమందు గురుడు

వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మందుగొనరే...!,

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు

ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
(4.)జన్మా సాధన దేనికో జీవా!ఖర్మకూ బాధ్యుడా వోయ్ జీవా!
జన్మా సాధన దేనికో జీవా!ఖర్మకూ బాధ్యుడా వోయ్ జీవా!
దారి లేని యూరిలోనా దాగియున్నది ఖర్మఫలము,
అనుభవింపక తప్పదోయ్ జీవా!
నీవనుభవింపక తప్పదోయ్ జీవా!
జన్మా సాధన దేనికో జీవా!ఖర్మకూ బాధ్యుడా వోయ్ జీవా!
ఎందుకొచ్చిన అహంభావము అంతులేని, మతద్వేషము.
ముందు గతినీ గానవోయ్ జీవా!
నీ బ్రతుకునూ సవరించుకో జీవా!
జన్మా సాధన దేనికో జీవా!ఖర్మకూ బాధ్యుడా వోయ్ జీవా!

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు

ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
(3.)ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
సారము లేని సంసారములో,
అందిన కొద్ది ఖర్మను చేసి,
కాలము తెలియక కాటికి పోతివి.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
ధనము చూచి మురిసిపోకుమా,
దానధర్మము నీకు తోడురా,
పరమేశ్వరుని మరచిపోకురా,
ముక్తి మార్గము నీకు తోడురా.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!
మేడలు మిద్దెలు స్థిరమని బ్రమచకు,
కులములు మతములు కూలిపోవురా,
వీరగురువుని సేవ చేయరా,
ముక్తి మార్గమే నీకు తోడురా.
ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా!

SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు

ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00

(2.)చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
మాయ సంసారంబురా ఇది మనసు నిలకడ లేదురా!
అన్నదమ్ములు ఆస్థిపాస్తులు అందరురును ఇల మాయరా!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
బంకమట్టి ఇల్లురా ఇది, అగ్గి బుగ్గై పోవురా!
నాది నీది యనుచు నరుడా వాదులాడబోకురా!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
రాజు పేదయనెడి భేధము జీవముండేవరకురా!
మట్టి మట్టి కలిసితెనిక ఎట్టి భేధము లేదురా!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
తత్త్వమర్మము తెలియకా నీవు తప్పు త్రోవల బోకురా!
ఆత్మయొక్కటె చావు లేకను అంతటను వెలుగొందురా!
చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా!
కన్ను మూసి తెరచులోపల కలిమిలేములు మాయురా ( మారురా )!
SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు.
ప్రకాశకులు

శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00