(12.) కోటలాటి కోటా
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
వెయ్యి బురుజుల కోటై యున్నది_ఏడు ఏరులు బారుచున్నది.
ఎరిగి పొయ్యే గుర్రమున్నది_వెళ్ళిపొయ్యేది బాటై యున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
కొండల నడుమ కొంగ యున్నది_కొంగ ముక్కులో లోకమున్నది.
కోటి దీపములు వెలుగుచున్నది_కోరిన వారికి ఫలమౌచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
ఆరు కొమ్ముల యేనుగున్నది_ఐదు కోతులను మేపుచున్నది.
ఆవల యివల జూచుచున్నది_అతిశయమైన ఆటాడుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
మేఘము లేని వర్షమున్నది_మేకలనైదు మేపుచున్నది.
మేఘములో ఫలమేయుచున్నది_మేలిమైన వైభోగమున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
మూలాధారమునందు యున్నది_మూల మూలకీ తిరుగుచున్నది.
మూలస్థానము ఒకటై యున్నది_మూల జ్యోతియై వెలుగుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
కాదములైదు బాగా యున్నది_నాలుగు దిక్కుల మ్రోగుచున్నది.
నాణ్యమైన భోగమున్నది_ఆది దేవుడు ముందున్నాడు..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
ఒంటి స్థంభము మేడ యున్నది_ఒకటి చూపుడులను చూచుచున్నది.
వూరి కప్ప వలె నవ్వుచున్నది_ఒకటి ఒకటి సరిపడుచున్నది.
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
పదమూడామడ పట్టణమున్నది_పాపల నడుమ లింగమున్నది.
పాము శిరసున పండు యున్నది_పరమ భక్తులకు ఎరుకైయున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
వీరబ్రహ్మము వాక్కుయున్నది_వివరము తెలిసితే బాగైయున్నది.
ఇంటిలోపల అన్నియున్నవి_వీధి లోపల వెలుగుచున్నది..
కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేదు.
SOURCE: శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి
ఆధ్యాత్మిక
కాలజ్ఞాన తత్త్వములు
ప్రకాశకులు
శ్రీ వీర బ్రహ్మేంద్ర పబ్లికేషన్స్
జవంగుల నాగేశ్వరరావు
శ్రీ వీర బ్రహ్మేంద్రాశ్రం
సత్తెనపల్లి-522 403, గుంటూరు జిల్లా.
వెల: రు. 15-00
WHY THIS BLOG TITLE IS NAMED AS “WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM” "అపరిచితుడు" అనగా పరిచయము లేని వ్యక్తి."అపరిమితుడు" అనగా పరిమితము లేని వ్యక్తి. విష్ణు స్వరూపుడైన వీర భోగ వసంత రాయలు మన సమాజం లోనే ఉంటూ మనకు పరిచయము అవకుండా మన మధ్యనే ఉన్నారు. శివ పురాణం ప్రకారం శివునికి అపరిమితుడు అనే పేరు కలదు. అందుకే ఈ బ్లాగుకి "WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM" అనే పేరు.
Blog Archive
-
▼
2011
(6)
-
▼
September
(6)
- (36.)వినుడి బ్రహ్మము మాయ వినుడి వినుడి జనులారా దుడ...
- (12.) కోటలాటి కోటా కోటలాటి కోటా. జగతిలో ఏ కోట లేద...
- (6.)వీరగురుని మందుగొనరే...ఓ నరులారా! వీరగురుని మంద...
- (4.)జన్మా సాధన దేనికో జీవా!ఖర్మకూ బాధ్యుడా వోయ్ జీ...
- (3.)ఎవరు రారు వెంట! ఎందుకు నీకీ తంటా! ఎవరు రారు వె...
- (2.)చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా! చంచలంబగ...
-
▼
September
(6)
No comments:
Post a Comment